ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
సజీవంగా అంతర్జాతీయ ఉగ్రవాది బిలాల్!
కరుడుగట్టిన ఉగ్రవాది మహ్మద్ అబ్దుల్ షహీద్ అలియాస్ బిలాల్ ప్రాణాలతోనే బతికి ఉన్నట్టు నిఘా విభాగాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఓ ప్రైవేట్ మీడియా ప్రతినిధికి నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. ముంబై, ఢిల్లీ, సంఝౌతా, మక్కా మసీదు, హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ఆజ్మీర్ షరీఫ్ వంటి పేలుళ్ళలో కీలక సూత్రధారిగా భావిస్తున్న బిలాల్ ఇటీవల పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి.

వీటిపై నిఘా వర్గాలు పెద్దగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన సియాల్‌కోటలో బిలాల్ సజీవంగా ఉన్నట్టు గూఢాచారి వర్గాలు పేర్కొన్నాయి. హర్కత్ ఉల్ జిహాదీ ఎ ఇస్లామీ కమాండర్ అయిన బిలాల్ స్వస్థలం హైదరాబాద్ కావడం గమనార్హం. ఆయన విధేయులు పలువురు హైదరాబాద్‌లోనే నివశిస్తున్నారు.
మరిన్ని
వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: సుప్రీం
సినిమాల్లో నటించేందుకు అవకాశం కల్పించాలి: మోనికబేడి
మధుమిత కేసు: మాజీ మంత్రికి జీవితఖైదు
కోవై పేలుళ్లు: అల్ ఉమా నేతలకు శిక్షలు ఖరారు
జాతీయ జెండాకు అగౌరవం.. అమీర్‌ఖాన్‌కు అరెస్టు వారెంట్
యూఎన్‌పీఏ కన్వీనర్‌గా చంద్రబాబు