దక్షిణ భారతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన కమలనాథుల కల నెరవేరబోతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అన్న జనతాదళ్ (ఎస్) ఎట్టకేలకు సమ్మతించింది. భాజపా నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ్ అంగీరించారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రంలోని కమలనాథులు ప్రభుత్వం ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.
ఈ పరిణామాలన్నీ వేగంగా జరిగిపోవడంతో శనివారం సాయత్రం మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ రాష్ట్ర గవర్నర్ రామేశ్వర్ ఠాగూర్‌ను కలిసి, తమ వైఖరిని వెల్లడించనున్నారు. ఇదిలావుండగా... పార్టీలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని దీన్ని నివారించేందుకు భాజపాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు దేవెగౌడ వివరణ ఇచ్చారు.
కుమార స్వామి నేతృత్వంలోని జేడీ(ఎస్) ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయిన విషయం తెల్సిందే. దీంతో కర్ణాటక అంసెబ్లీని సుషుప్త చేతనావస్థలో ఉంచిన విషయం తెల్సిందే.
|