ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
సేతు సముద్ర ప్రాజెక్టుకు ప్రజల ఆమోదం
సేతు సముద్ర ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎక్కువ మంది ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారని సుప్రీం నియమించిన పదిమందితో కూడిన కమిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుపై చెలరేగిన వివాదానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు 10 మందితో కూడిన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి వివిధ ప్రాంతాల్లో పర్యటించి దాదాపు 20 వేల మంది వద్ద అభిప్రాయ సేకరణ జరిపింది.

ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు సముఖంగానే ఉన్నట్టు కమిటీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ కమిటీలో నిపుణులు ఎవరూ లేరని అందువల్ల మరొక కమిటీని ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమిటీలో ఉండే వారంతా నాస్తికులు కావడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికను తయారు చేశారని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.
మరిన్ని
రష్యాతో స్నేహస్తానికే తొలి ప్రాధాన్యత: ప్రధాని
వామపక్ష నేతలతో ప్రధాని విందు భేటీ
లోక్‌సభ సభ్యత్వానికి మమత రాజీనామా
రేపు రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని
హింసకు ఆజ్యం పోస్తున్న గవర్నర్: సీపీఎం
నందిగ్రామ్ పట్ల సీపీఎం వైఖరి సరికాదు: గవర్నర్