ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
నా దగ్గర మంత్రదండం లేదు: సోనియా
FileFILE
తన దగ్గర కానీ, తన కుమారుడైన రాహుల్ గాంధీ వద్ద కానీ ఎలాంటి మంత్రదండం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో పార్టీ విజయం కేవలం తమ ఇరువురి చేతులలో లేదని, పార్టీ శ్రేణుల అకుంఠిత దీక్ష, కార్యదక్షతతోనే పార్టీ విజయం ముడిపడి ఉంటుందని సోనియా గాంధీ అన్నారు.

శనివారం న్యూఢిల్లీలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశంలో ముగింపు సందర్భంగా సోనియా గాంధీ కీలక ఉపన్యాసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని పునఃప్రతిష్టించేందుకు పార్టీ వర్గాలు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యకర్తలలో మరింత అంకితభావాన్ని నెలకొల్పే దిశగా పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు తెలిపారు.

తన ప్రసంగాన్ని హిందీలో సాగించిన సోనియా గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో కార్యకర్తలు అనేక సవాళ్ళను ఎదుర్కుంటున్నారు. అదేసమయంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో కూడిన సంబంధాలు ఉండాలని అన్నారు.
మరిన్ని
ఆయన నాయకత్వంలో పని చేయాలని ఉంది: రాహుల్
సంకీర్ణంలో సిద్ధాంతాలను వదులుకోం: సోనియా
పేదల పాలిట పెన్నిధి కాంగ్రెస్: మన్మోహన్
రాహుల్ కిడ్నాప్‌కు కుట్ర: తీవ్రవాదుల అరెస్టు
నందిగ్రామ్‌లో ఆరని హింసాత్మక సంఘటనలు
ఈనెల 27న అణు ఒప్పందంపై చర్చ