ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
 
సంకీర్ణంలో సిద్ధాంతాలను వదులుకోం: సోనియా
సంకీర్ణ ధర్మానికి లోబడినంతమాత్రన పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వబోమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం జరుగుతున్న ఏఐసీసీ సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ...భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల్లో గాంధీ సిద్ధాంతాలను కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాల్సిన భాజపా.. ఆ కర్తవ్యాన్ని విస్మరించి నడుచుకుంటోందన్నారు.

దీనికి తోడు దేశంలో వేర్పాటువాద రాజకీయాలను ఆ పార్టీ ప్రోత్సహిస్తోందని సోనియా గాంధీ ఆరోపించారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్ పార్టీ పరిపాలనా, నిర్వహణల్లో కాంగ్రెస్ పార్టీ పారదర్శకతను పాటిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సరిదిద్ధి, పార్టీకి పూర్వ వైభవం కల్పించేందుకు పార్టీ శ్రేణులు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు.
మరిన్ని
నా దగ్గర మంత్రదండం లేదు: సోనియా
ఆయన నాయకత్వంలో పని చేయాలని ఉంది: రాహుల్
సంకీర్ణంలో సిద్ధాంతాలను వదులుకోం: సోనియా
పేదల పాలిట పెన్నిధి కాంగ్రెస్: మన్మోహన్
రాహుల్ కిడ్నాప్‌కు కుట్ర: తీవ్రవాదుల అరెస్టు
నందిగ్రామ్‌లో ఆరని హింసాత్మక సంఘటనలు