బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై 16 సంవత్సరాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో మసీదు కూల్చివేత కేసుపై ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లా న్యాయస్థానం వాదనలను విననున్న సందర్భంగా కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఐదు బాంబులను పోలీసులు గురువారం కనుగొన్నారు. అయితే కనుగొన్న బాంబులు బాణసంచా సామాగ్రిగా లక్నో డీఐజీ నిర్ధారించారు.
దీంతో ఉత్తరప్రదేశ్‌లోని న్యాయస్థానాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కోర్టు ప్రధాన ద్వారం వద్ద సైకిల్‌కు తగిలించిన సంచిలో బాంబులను పోలీసులు కనుగొన్నారు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు కేసు విచారణ నిమిత్తం ఒక సాక్షి బుధవారం రాయబరేలీ జిల్లా కోర్టు ఎదుట బుధవారం హాజరయ్యారు. అయోధ్యలో గల మూడు ప్రధాన దేవాలయాలైన హనుమాన్‌గర్హి, నాగేశ్వర్‌నాథ్ మరియు కనక్ భవన్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
|