ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెస్‌కు సీపీఎం తాజా హెచ్చరిక
అణు ఒప్పందం ప్రకంపనలు సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో సీపీఎం ఆదివారం మరోబాంబు పేల్చింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో జరుపుతున్న చర్చలు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించింది. లేని పక్షంలో మధ్యంతర ఎన్నికలు ఎదుర్కొనక తప్పదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ హెచ్చరించారు. దీనిపై ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. కేంద్రంలోని యూపీఏ సర్కారు తాము చెప్పినట్టుగా వినకపోతే మద్దుతును ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామపక్షాలు ఇటీవలి కాలంలో తమ పట్టును కొంతమేరకు సడలించాయి. దీంతో.. ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్.. అంతర్జాతీయ అణు శక్తి సంస్థతో చర్చలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సీపీఎం సమావేశంలో పాల్గొన్న ప్రకాష్ కారత్.. కాంగ్రెస్ పార్టీకి తాజా అల్టిమేటం ఇచ్చారు. ఐఈఏఐతో జరుపుతున్న చర్చలు తక్షణం పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని
సోనియాకు ఎన్నికల సంఘం నోటీసులు
నేటితో గుజరాత్ తొలి దశ ఎన్నికల ప్రచారానికి తెర
సోనియాపై చర్యకు భాజపా బహిరంగ లేఖ
ఇజ్రాయేల్‌తో సైనిక సంబంధాలు వద్దు : సీపీఎం
ప్రభుత్వ శాఖల ప్రక్షాళనపై మాయా దృష్టి
కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇండో-పాక్ చర్చలు