పార్లమెంటుపై దాడి: ఆరు సంవత్సరాలు పూర్తి

PNR| Last Modified గురువారం, 13 డిశెంబరు 2007 (10:09 IST)
భారత పార్లమెంటుపై తీవ్రవాదుల దాడి దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలి పోయింది. గత 2001 సంవత్సరం డిసెంబరు 13వ తేదీన తీవ్రవాదులు దేశ రాజధానిలోని పార్లమెంటు భవనంపై దాడి చేసి గురువారాని (నేటికి) ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యర్థం పార్లమెంట్ భవన్ ఆవరణంలో స్మారక సభలు, వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి.

తీవ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన తీవ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. అయితే.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి అఫ్జల్ పెట్టుకున్న వినతిపత్రం పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును నిలిపేవేశారు.

ఈ చీకటి రోజు జ్ఞాపకార్థంగా భారతీయ జనతా పార్టీ కొన్ని సీడీలను విడుదల చేసింది. పార్లమెంట్‌పై జరిగిన సమయంలో తీసిన వీడియో చిత్రాలతో కూడిన సీడీని ఆ పార్టీ విడుదల చేసింది.


దీనిపై మరింత చదవండి :