గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా.. 117 స్థానాలు గెలుచుకుని నాలుగో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు దశలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం నుంచి భాజపా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది.
మొత్తం స్థానాల ఫలితాలను ఆదివారం సాయంత్రం మూడు గంటలకంతా ప్రకటించారు. ఇందులో భాజపా 117 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలసి 62 స్థానాల్లోను ఇతరులు మూడు సీట్లలో గెలుపొందారు. సౌరాష్ట్ర, మధ్యగుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌లలో భాజపా స్పష్టమైన అధిక్యాన్ని సంపాదించింది.
సౌరాష్ట్రలో ఉన్న మొత్తం 58 సీట్లకు గాను భాజపా.. 43, కాంగ్రెస్ 15 సీట్లను దక్కించుకున్నాయి. అలాగే.. దక్షిణ గుజరాత్‌లో 36 సీట్లకు గాను భాజపా 18. కాంగ్రెస్ 10 సీట్లలోను, ఉత్తర గుజరాత్‌లో 52 స్థానాలకు గాను 36 స్థానాలుక భాజపా, కాంగ్రెస్ 13 సీట్లలో గెలుపొందాయి. మధ్య గుజరాత్‌లోని 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాల్లోను, భాజపా 18 సీట్లు, ఇతరులు ఒక స్థానంలోను గెలుపొందారు.
|