ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సజీవంగానే "అణు" ఆశలు: ప్రణబ్ ముఖర్జీ
అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అణు ఒప్పందంపై ఆశలను వదులుకోలేదని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అణు ఒప్పందం కారణంగానే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి ఎదురైందని వస్తున్న వార్తలను ఖండించారు. అణు ఒప్పందానికి, అసెంబ్లీ ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

అదేసమయంలో అణు ఒప్పందం ఆటకెక్కిందని వస్తున్న ఊహాగానాలను కూడా ప్రణబ్ కొట్టివేశారు. ఒప్పందం అమలుకు సమబంధించిన కసరత్తు సాగుతోందని, ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చలు సాగుతున్నాయని మంత్రి ముఖర్జీ వివరించారు. అయితే ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమలుకు వస్తుందో చెప్పాలన్న ప్రశ్నకు మాత్రం ప్రణబ్ ముఖర్జీ సమాధానం చెప్పకుండా దాటవేశారు.
మరిన్ని
మంత్రి వర్గాన్ని విస్తరించిన నరేంద్ర మోడీ
పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తాం: ఏచూరీ
నాగాలాండ్‌లో రాష్ట్రపతి పాలన
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: దేవెగౌడ
లోక్‌సభకు మధ్యంతరం ఖాయం: రాజ్‌నాథ్ జోస్యం
నెల రోజుల రిమాండ్‌లోకి అబూసలేం