ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరునిపై బుధవారం లక్నో పోలీసులు చేసిన లాఠీ ఛార్జితో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఎస్‌పీ కార్యకర్తలు మరియు విద్యార్థులకు మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక వాతావరణానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి తన పదవికి రాజీనామా చేయాలని ములాయం సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు.
అయితే తన పార్టీకి చెందిన గూండాలను ములాయం సింగ్ యాదవ్ పోలీసులపైకి ఉసికొల్పడంతో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుందని మాయావతి ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులపై తగు చర్యలు చేపట్టేంతవరకు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ములాయం సింగ్ యాదవ్ తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానికి కూల్చివేసే కుట్రలో భాగంగా ములాయం సింగ్ యాదవ్ విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారని మాయావతి విమర్శించారు.
|