ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్-చైనాల మధ్య రైలు ఒప్పందం
భారత్-చైనాల మధ్య రైలు ఒప్పందం కుదురనుంది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా పర్యటన సమయంలో ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. ప్రధాని చైనా పర్యటన వచ్చే ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ పర్యటన సమయంలో గృహ నిర్మాణంతో పాటు.. ఇతర సెక్టార్లపై కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదురనున్నాయి. రైలు ఒప్పందం పూర్తయితే ఇరు దేశాల మధ్య రైలు సర్వీలు నడిపేందుకు రెండు దేశాలు చర్యలు చేపడతాయి.

ఇదిలావుండగా.. జార్ఖండ్‌ రాష్ట్రంతో పాటు.. ఈశాన్య రష్ట్రాలైన అస్సోం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కేంద్ర కేబినెట్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3,726 అసెంబ్లీ స్థానాలు, 513 లోక్‌సభా స్థానాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పనులు పూర్తయిన విషయం తెల్సిందే.
మరిన్ని
పొత్తులు కుదర్చని జయ-మోడీ సమావేశం
ఓటర్ల జాబితా బాధ్యత రాజకీయ పక్షాలదే: సీఈసీ
జైపూర్ కోర్టులో లొంగిపోయిన బీబీ మోహంతి
ఉత్తర ప్రదేశ్‌లో ఉద్రిక్తత
హిమపాతానికి 16 మంది మృతి
వాజ్‌పేయికి భారతరత్న: అద్వానీ