తీవ్రవాదుల హిట్ లిస్టులో వున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీతో పాటు.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలకు అదనపు భద్రత కల్పించాలని భాజపా కేంద్రాన్ని కోరింది. ఇటీవల కాలంలో తీవ్రవాదులు, ముస్లిం సంస్థల నుంచి వీరివురికి వస్తున్న బెదిరింపుల నేఫథ్యంలో మరింత భద్రత అవసరమని బిజెపి డిమాండ్ చేసింది. ఈ విషయంపై కేంద్రం తప్పనిసరిగా స్పందించి, వారిద్దరికి భద్రతను మరింత పటిష్టం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరాంతంలో జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో సహ దాదాపు అన్ని రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
|