దక్షిణభారత దేశంలో తొలసారి అధికార పగ్గాలు చేపట్టిన కమలనాథుల పట్ల కర్నాటక రాష్ట్ర ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్-భాజపాల మధ్య కుదిరిన సంకీర్ణ ఒప్పందం ధర్మాన్ని ఇరు వర్గాలు పాటించడంలో పూర్తిగా విఫలమైన విషయం తెల్సిందే. దీంతో అధికార పగ్గాలు చేపట్టిన వారం రోజుల్లోనే కమలనాథులు ప్రభుత్వాన్ని కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నై, బెంగుళూరులకు చెందిన రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించారు.
ఇందులో కర్నాటక ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలోని 24 జిల్లాలో 2580 మంది వద్ద ఈ విద్యార్థులు సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది భాజపా పట్ల మొగ్గు చూపించగా, 24 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి, 8.8 మందికి జేడీఎస్ నాయకత్వానికి మద్దతు పలికారు. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో యడ్డియూరప్ప (భాజపా)కు 49.1 శాతం, కుమారస్వామి (జేడీఎస్)కి 37.6 శాతం, ఎస్ఎంకృష్ణ (కాంగ్రెస్) 5.7 శాతం మంది మద్దతు పలికారు.
|