ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాగాలాండ్‌లో పర్యటించనున్న ప్రధాని, సోనియా
వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి ఐదో తేదీన నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఎన్నికల ప్రచారం కోసం నాగాలాండ్‌లో పర్యటించనున్నారు. ఈనెల 23వ తేదీన దిమాపూర్‌లో జరిగే బహిరంగ ర్యాలీలో సోనియా గాంధీ, మార్చి ఒకటో తేదీన జరిగే ర్యాలీలో ప్రధాని సింగ్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిపాయి. ఇదిలావుండగా జాతీయ భద్రతా కమిటీ సలహాదారు ఎంకే.నారాయణన్ ఈ రాష్ట్రంలో ప్రర్యటిస్తున్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన నాగాలాండ్ గవర్నర్ కె.శంకరనారాయణన్‌తో భేటీ అయ్యారు. అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో పాటు ఆర్మీ అధికారులులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
మరిన్ని
మాన్యత నా భార్య: కోర్టుకెక్కిన ఖైదీ
జల్లికట్టులో 100 మందికి గాయాలు - ఒకరి మృతి
అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్న ఆంటోని
ఒరిస్సాలో నక్సలైట్ల దాడి: 14 మంది మృతి
సుప్రీం కోర్టు భద్రతకు త్రిసభ్య కమిటీ
నందిగ్రామ్‌ కాల్పులపై సీబీఐ నివేదిక సమర్పణ