రాయ్‌బరేలిలో బుధవారం జెయిస్ వద్ద రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా, పెట్రోలియం సహాయ శాఖ మంత్రి దిన్షా పటేల్ తదితరులు కూడా పాల్గొన్నారు. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థ అయిన ఐఐటీల వలే పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆర్‌జీఐపీటీ సంస్థను నిర్వహిస్తారు.
ఈ ఉన్నతస్థాయి విద్యాసంస్థ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా విద్యాబోధనతో కూడిన వాణిజ్యం, అధ్యయనాలపై ప్రత్యేకంగా శిక్షణనిస్తారు.
|