వచ్చే నెల ఐదో తేదీన జరిగే నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక రోజు పర్యటన నిర్వహించనున్నారు. దీనిపై ఏఐసిసి కార్యదర్శి రంజి థామస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన కోహిమాలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొంటారని చెప్పారు. ఈ బహిరంగ సభ తర్వాత ఆయన మేఘాలయాలో జరిగే మరొక ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళతారని ఆయన చెప్పారు.
అలాగే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వచ్చే నెల ఒకటో తేదీన మొకోక్చుంగ్, దిమాపూర్‌లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని వివరించారు. అదే రోజు ఆమె మేఘాలయాకు వెళ్లే సూచనలు వున్నట్టు రంజీ థామస్ వివరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో పాటు.. మరికొన్ని పార్టీలు పోటీలో వున్నాయి.
|