కేంద్రంలోని యూపీఏ సర్కారు అమలు చేస్తున్న విధాన వల్లే రైల్వే శాఖ లాభాలను అర్జిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం ఆయన విజయవంతంగా ఐదో సారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యూపీఏ విధివిధానాలు రైల్వే శాఖను లాభాల బాటలో పయనింపజేస్తోందని ప్రకటించారు. అలాగే.. సరకుల రవాణా ద్వారా 20,000 కోట్ల మేరకు లాభాలను అర్జించినట్టు ఆయన ప్రకటించారు.
అలాగే పేలోడ్ లక్ష్యాన్ని 790 టన్నుల మేరకు సాధించినట్టు లాలూ తెలిపారు. అన్ని రైళ్ళలో మోడరన్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సొఫిస్టిగేటెడ్ కోచ్‌లను అమర్చనున్నట్టు లాలూ తెలిపారు. ఈ-టిక్కెటింగ్ కౌంటర్ల సంఖ్యను మరో ఏడాదిలో లక్ష నుంచి మూడు లక్షలకు పెంచుతామని తెలిపారు. వచ్చే 2009 నాటికి ఐటీ మార్గాల మీదుగా లింకు రైలు సర్వీసులను నడుపనున్నట్టు లాలూ ప్రకటించారు. రైలు రాకపోకను ముందుగానే మరో స్టేషన్‌లో తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
|