లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2008-09 రైల్వే వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిప్పికొట్టారు. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని దీన్ని రూపొందించలేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. నిలకడగా వున్న స్టాక్ మార్కెట్‌కు నూతనోత్తేజాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనదిగా లాలూ వ్యాఖ్యానించారు.
బడ్జెట్‌లో ప్రయాణికులతో పాటు సరకుల రవాణాపై అదనపు భారం మోపకుండా అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ప్రవేశపెట్టడంతో తాను ప్రదర్శించిన శక్తిసామర్థ్యాల పట్ల ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయన్నారు. నేను ఎంతో సంతోషంగా వున్నా. ఒక రైల్వే మంత్రిగా తనను తాను నిరూపించుకున్నాను. ఈ ఈర్షతోనే ప్రతిపక్ష సభ్యులు దీనిపై రాద్ధాతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి లాలూ గుర్తు చేశారు.
|