ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రేపు బుష్‌తో భేటీ కానున్న ప్రణబ్ ముఖర్జీ
కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన అమెరికా పర్యటనలో భాగంగా.. సోమవారం ఆ దేశ అధ్యక్షుడు జార్జి బుష్‌తో భేటీకానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆదివారం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ తొలుత స్టేట్ కార్యదర్శి కండోలినా రైస్‌తో సోమవారం ఉదయం సమావేశమవుతారు. వీరిద్దరి మధ్య ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై కీలక చర్చలు జరిగే అవకాశముంది.

ఆ తర్వాత వైట్‌హౌస్‌కు చేరుకునే ప్రణబ్ యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుడు స్టీఫెన్ హెడ్లీ, ఆ తర్వాత జార్జి బుష్‌తో సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన ముగించుకునే ప్రణబ్ మంగళవారం తిరుగు పయనమవుతారు. ప్రణబ్ తన పర్యటనలో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చించనున్నారు. అతి ముఖ్యమైన అణు ఒప్పందంపై ప్రణబ్ ముఖర్జీ ఏ మేరకు అమెరికాను ఒప్పిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
మరిన్ని
ఐఏఈఏతో రక్షణ ఒప్పందం సిద్ధం: ప్రణబ్ ముఖర్జీ
తమిళనాడులో భారీ వర్షాలు: 12 మంది మృతి
25 నుంచి రాహుల్ కర్ణాటక పర్యటన ప్రారంభం
కేంద్రంలో "ముందస్తు"కు తావేలేదు: పవార్
రూ.3 లక్షల ఆర్థిక సాయం: క్యాబినెట్ కీలక నిర్ణయం
సరబ్జీత్‌ కోసం ఖైదీల విడుదల చేయం: జైశ్వాల్