శ్రీనగర్‌లోని సుమారు 60 రకాల పువ్వులతో ఆసియాలోనే అతి పెద్ద మెగా ఫ్లవర్ గార్డెన్‌గా పేరొందనున్న సిరాజ్‌బాగ్ వద్ద ఉన్న తులిప్ గార్డెన్‌ను యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ శనివారం ప్రారంభించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
దాల్ సరస్సుకు సమీపంలోని జబర్వన్ కొండ ప్రాంతం వద్ద ఈ గార్డెన్ ఉంది. వాస్తవానికి ఆ గార్డెన్‌ను వచ్చే నెలలో ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పుష్పాలు ముందుగానే సంపూర్ణ పరిణత స్థితికి చేరడంతో ఈ నెలలోనే ఆవిష్కరించాలని నిశ్చయించారు.
ఐదు హెక్టార్ల విస్తీర్ణంలోని సుమారు 60 రకాలలో ఇప్పటికే పుష్పించినవి, పుష్పిస్తున్నవి.. ప్రాథమిక దశలో ఉన్నవి గార్డెన్‌కు అందాన్ని ఇస్తున్నాయి. అలాగే ఎరుపు, నారింజపండు రంగు, తెలుపు, పింక్, పసుపు తదితరమైన రంగుల్లోని పుష్పాలు ఆ ప్రాంతంలో పరిచినట్లుండటం మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి.
ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ సృష్టిరూపమైన ఈ గార్డెన్ స్థానికంగా సిరాజ్‌బాగ్‌గా సుపరిచితమైనది. ఇక్కడ సుమారు 400 మంది కూలీలు, 150 మంది గార్డెనర్‌లు ప్రస్తుతం ఇక్కడి పుష్పాల అందాలను పరిశీలిస్తుంటారు.
|