భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతామని ఆయన వెల్లడించారు. ఆదివారం పాకిస్థాన్‌కు చెందిన డాన్ న్యూస్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనస్సులోని మాటలను వెల్లడించారు. దేశ విభజన ద్వారా ఇరు దేశాల ప్రజల సమస్యలు పరిష్కారం కావనే విషయం స్పష్టమైందన్నారు.
అందువల్ల ఇరు దేశాల సమస్యల పర్కిషారానికి భారత్, పాక్‌లు కలిసి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా కాశ్మీర్ అంశంతో సహా దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి భారత్, పాకిస్థాన్‌లు కలిసి ముందుకు రావాలని అద్వానీ విజ్ఞప్తి చేశారు.
|