ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్ జైళ్ళలో 489 మంది భారతీయ ఖైదీలు
పాకిస్థాన్‌లోని వివిధ జైళ్ళలో 489 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నట్టు కేంద్రం మంగళవారం వెల్లడించింది. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా, ఎం.రాజ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీప్రకాష్ జైశ్వాల్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్న జాబితా ప్రకారం పాక్ జైళ్లలో 436 మంది జాలర్లు, మరో 53 మంది సాధారణ ఖైదీలు ఉన్నట్టు మంత్రి వివరించారు.

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా భారత్-పాకిస్థాన్ న్యాయవ్యవస్థ కమిటీ ఖైదీల సంఖ్యను నిర్ధారించిందని చెప్పారు. అలాగే భారత్‌ కూడా పాకిస్థాన్‌కు ఒక జాబితాను అందజేసిందని, అందులో 133 మంది ఇతర ఖైదీలు, 14 మంది జాలర్లు మన దేశ జైళ్ళలో ఉన్నట్టు వివరించారు. ఈ ఖైదీలు ఎపుడు విడుదల చేస్తారన్న విషయంపై ఖచ్చితమైన సమయం ఏదీ నిర్ణయించలేదని మంత్రి పేర్కొన్నారు.
మరిన్ని
రక్షణ దళాలకు సముచిత వేతనం: ప్రధాని
ఆ రాష్ట్రాల అభివృద్ధికి రూ.75 వేల కోట్లతో ప్యాకేజి: పాటిల్
బెంగాల్ బంద్: స్తంభించిన జన జీవనం
ఉత్తరాఖండ్‌లో కాషాయం రెపరెపలు
భారత్-పాక్ సమస్యల పరిష్కారానికి కృషి: అద్వానీ
కోటా అమలుకు శ్రీకారం చుట్టండి: కేంద్రం