ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై దద్దరిల్లిన ఉభయసభలు
చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లి పోయాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ రాష్ట్రాలుగా విభజించాలని మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌కు చెందిన బీఎస్పీ సభ్యులు ఉభయ సభల్లో పట్టుబట్టారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై సభలో వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అంగీకరించ లేదు. అయినప్పటికీ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి, బుందేల్‌ఖండ్‌ రైతుల సమస్యలపై చర్చ జరపాలని వారు పట్టుబట్టారు. సభ్యుల నిరసనల మధ్యనే స్పీకర్ సోమనాథ్ ధరిత్రీ దినోత్సవం సందేశాన్ని సభలో చదివి వినిపించారు. అప్పటికీ బీఎస్పీ సభ్యులు నిరసనలు ఆగక పోవడంతో సభను యాభై నిమిషాల పాటు వాయిదా వేశారు.
మరిన్ని
పాక్ జైళ్ళలో 489 మంది భారతీయ ఖైదీలు
రక్షణ దళాలకు సముచిత వేతనం: ప్రధాని
ఆ రాష్ట్రాల అభివృద్ధికి రూ.75 వేల కోట్లతో ప్యాకేజి: పాటిల్
బెంగాల్ బంద్: స్తంభించిన జన జీవనం
ఉత్తరాఖండ్‌లో కాషాయం రెపరెపలు
భారత్-పాక్ సమస్యల పరిష్కారానికి కృషి: అద్వానీ