చైనా సరిహద్దు ప్రాంతంలో ఉదాశీనంగా వ్యవహరించవద్దని సైన్యానికి రక్షణ మంత్రి ఏకే ఆంటొనీ హెచ్చరించారు. చైనాతో పరస్పర విశ్వాస పెంపు చర్యలు చేపడుతున్నప్పటికీ, భద్రత విషయంలో మాత్రం అప్రమత్తంగానే ఉండాలని సూచించారు.
చైనా ఉన్నత స్థాయి కమాండర్ల ద్వైవార్షిక సదస్సును ఢిల్లీలో మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సైనిక, ఆర్థిక సామర్థ్యాలను పెంచుకునే విషయంపై నిత్యం దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాతో వివాదం ఏర్పడిన ప్రాంతానికి ఇటీవలే వెళ్లివచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. సీమాంతర తీవ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్‌లోని కొత్త ప్రభుత్వం కృషి చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
|