ప్రముఖ గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే గురువారం తెల్లవారుజామున దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమెకు వయస్సు 79 సంవత్సరాలు. ఆమె గత రెండు మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి ఎప్పటిలా నిద్రకు ఉపక్రమించిన ఆమె గురువారం తెల్లవారుజామున శాశ్వత నిద్రలోకి వెళ్లినట్టు ఆమెకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ఒకరైన రాజశ్రీ వెల్లడించారు.
దేశ్‌పాండే రాజ్యసభ సభ్యురాలిగా ఉంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన పాండే.. గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గత 2006 సంవత్సరంలో 'పద్మ' అవార్డుతో సత్కరించింది. దేశ్‌పాండే మృతి పట్ల రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, భాజపా అగ్రనేత అద్వానీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి తదితరులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
|