ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సరికొత్త శిక్షణ పొందాలి: కలాం పిలుపు
కొత్త పుంతలు తొక్కుతున్న ఫ్యాషన్‌‌ టెక్నాలజీ రంగంలో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు శిక్షణ పొందాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (కాడ్) శిక్షణ ద్వారా ఫ్యాషన్ రంగంలో తర్ఫీదు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అందుబాటులో ఉన్న సరికొత్త టెక్నాలజీని విద్యార్థులు ఉపయోగించి నాణ్యమైన గార్మెంట్స్‌ను ఉత్పత్తి చేయాలని కోరారు.

తిరుపూర్‌లోని నిఫ్ట్-టీ నిట్‌వేర్ ఫ్యాషన్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అలాగే శిక్షణా కేంద్రాలు సరైన కంప్యూటర్ పరికరాలు, పూర్తిస్థాయి ప్రయోగశాలలు, తగిన మౌలిక సదుపాయాలను కలిగి వుండాలన్నారు. అంతేకాకుండా తిరుపూర్‌కు 'ది నిట్‌వేర్ హబ్ ఆఫ్ ఇండియా'గా పేరుందని కలాం గుర్తు చేశారు.
మరిన్ని
గాంధేయవాది నిర్మలా దేశ్‌పాండే అస్తమయం
చీర్ లీడర్స్‌ ఆటాపాటలపై కేంద్రం సీరియస్  
సరబ్‌జీత్‌కు క్షమాభిక్ష: భారత్ విశ్వాసం
నేర చరిత్రలేని వారే పోలింగ్ ఏజెంట్లు: ఈసీ
ధరల పెరుగుదలపై సీపీఎం అల్టిమేటం
కర్ణాటకలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి