ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
28న యూపీఏ-లెఫ్ట్ నేతల భేటీ: ప్రణబ్
ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై యూపీఏ, వామపక్ష పార్టీల నేతల మధ్య చర్చలు కొనసాగుతాయని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఈనెల 28వ తేదీన మరోసారి భేటీ కానున్నట్టు ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. అణు ఒప్పందంపై లెఫ్ట్ పార్టీలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను నివృత్తి చేసేందుకు గాను యూపీఏ-లెఫ్ట్ సమన్వయ కమిటీ ఏర్పాటైన విషయం తెల్సిందే. ఈ కమిటీ ఎన్నోమార్లు సమావేశమైనప్పటికీ.. అణు ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాలేక పోతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం కమిటీ నేతలు మరోసారి భేటీ అయ్యారు. ఇందులో భారత‌కు ప్రాధాన్యమిచ్చే సురక్షిత రక్షణ ఒప్పందంపై రెండు గంటల పాటు నేతలు కూలంకుషంగా చర్చలు జరిపారు. అయినప్పటికీ ఒక అభిప్రాయానికి రాలేక పోయారు. ఈ సమావేశం అనంతరం ప్రణబ్ ముఖర్జీ వామపక్ష నేతలు మరికొన్ని సందేహాలను వ్యక్తం చేశారని, వీటిని కొద్ది రోజుల్లో నివృత్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఈనెల 28వ తేదీన మరోసారి భేటీ అవుతామని ముఖర్జీ చెప్పారు.
మరిన్ని
స్టాండింగ్ కమిటీ పరిశీలనకు మహిళా బిల్లు
యూపీఏ-లెఫ్ట్ కమిటీ ఈనెల 28న తదుపరి చర్చలు
మహిళా బిల్లులో ఎస్సీలకు ప్రత్యేక కోటా: బీఎస్పీ
రాజ్యసభలో మహిళా బిల్లు: సభ వాయిదా
నేడు 'ఎగువ సభ'లో మహిళా బిల్లు..!
మహిళా బిల్లును వ్యతిరేకించను: లాలు