ఒరిస్సా తీరంలోని వీలార్ దీవి నుంచి బుధవారం ప్రయోగించిన అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతంగా ముగిసింది. మొత్తం 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి, 1.5 టన్నుల బరువుగల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగలదు. అలాగే ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను సులభంగా ఛేదిస్తుంది.
కాగా, అగ్ని పరీక్షను తొలిసారి 2006 సంవత్సరం జులై తొమ్మిదో తేదీన నిర్వహించారు. ఆ తర్వాత రెండో పరీక్షను 2007 ఏప్రిల్ 12వ తేదీన విజయవంతంగా పూర్తి చేసినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే.. తొలి సారి నిర్వహించిన అగ్ని-3 పరీక్ష విఫలమైంది.
పరీక్ష ప్రారంభమైన 65 సెకన్లకే నియంత్రణ కోల్పోయిన క్షిపణి బంగాళాఖాతంలో కూలిపోయింది. ఆ తర్వాత ఏప్రిల్ 2007లో నిర్వహించిన రెండో అగ్ని పరీక్ష సక్సెస్ అయింది. ప్రస్తుతం ప్రయోగించిన అగ్ని-3 క్షిపణి పరధిలోకి చైనా, షాంఘై ప్రాంతాలు వస్తాయి.
|