ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పోటీ రాజకీయాలతో దార్శనికతకు బ్రేక్
పోటీ రాజకీయాల కారణంగా దేశాన్ని అగ్రస్థానానికి చేర్చే దార్శనికతను నేతలు పక్కనబెడుతున్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. దీర్ఘ కాలిక ప్రణాళికలను రూపొందించలేని రాజకీయ వ్యవస్థ మన దేశంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఐఏఎస్ ప్రోబేషనర్‌ల మధ్య ఆయన బుధవారం సాయంత్రం ప్రసంగిస్తూ కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం
మారుతుండటం, ప్రతి నిత్యం ఎక్కడో ఓ రాష్ట్రంలో లేక నియోజక వర్గాల్లో ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతుండటంతో నేతల దృష్టి ఎల్లవేళలా దానిపైనే ఉంటోందన్నారు.

అంతమాత్రాన రాజకీయాలు ప్రాముఖ్యం లేనివని తాను చెప్పడం లేదన్నారు. పలు విధాలుగా రాజకీయ నేతలు ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారని చెప్పారు. అయినా దీర్ఘ కాలిక వ్యూహంతోనే దేశం పురోగతి దిశగా పయనించగలదని అభిప్రాయపడ్డారు.
మరిన్ని
కర్ణాటకలో సంకీర్ణానికి దూరం : సోనియా
బెంగాల్‌ రాజ్‌భవన్‌లో 'గాంధీగిరి'
రాజ్‌థాక్రేపై చర్యకు మహారాష్ట్ర సన్నద్ధం
అగ్ని-3 క్షిపణి ప్రయోగం సక్సెస్
28న యూపీఏ-లెఫ్ట్ నేతల భేటీ: ప్రణబ్
స్టాండింగ్ కమిటీ పరిశీలనకు మహిళా బిల్లు