ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కర్ణాటకలో 50 శాతం మేర పోలింగ్ నమోదు
కర్ణాటక శాసనసభకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 50 శాతం మేర పోలింగ్ నమోదైంది. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. దక్షిణ కర్ణాటకలోని 11 జిల్లాలోని 89 స్థానాలకు ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో 950 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బరిలోకి దిగారు. ఇందులో 440 మంది స్వంతంత్రులు కావడం గమనార్హం.

దక్షిణ కర్ణాటకలోని 1.73 కోట్ల మంది ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 సీట్లు ఉండగా, ఈనెల 16వ తేదీన జరిగే రెండో దశ పోలింగ్‌లో 66 సీట్లు, ఈనెల 22వ తేదీన మిగిలిన 69 స్థానాలకు తుది దశలో ఎన్నికలు జరుగుతాయి.

తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించటానికి 58వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. బెంగళూరు నగరంలోనే 28 అసెంబ్లీ స్థానాలు ఉండటం గమనార్హం. తొలి దశ ఎన్నికల్లో పోటీపడ్డ ప్రముఖుల్లో మాజీ సీఎం కుమారస్వామి, అతని సోదరుడు రేవణ్ణ, కేంద్ర మంత్రి అంబరీష్, చెలువ రాయస్వామి, సినీ నటుడు జగ్గేష్, డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ మంత్రులు కట్టా సుబ్రమణ్య నాయుడు, జీటీ దేవగౌడ, ఆర్ అశోక్, పరమేశ్వర, మాజీ ఉప ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 25వ తేదీన జరుగుతుంది.
మరిన్ని
బెంగాల్ సీపీఎం కార్యకర్తలపై మున్షీ మండిపాటు
'అణు' ఒప్పందంపై అనుమానాలొద్దు: కలాం
మంత్రి అర్జున్ సింగ్ వ్యాఖ్యలను కొట్టేసిన కాంగ్రెస్
కర్ణాటక ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
స్థిర ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్‌కే సాధ్యం: ప్రధాని
కర్ణాటక ఎన్నికలు: రేపు తొలి దశ పోలింగ్