ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కర్ణాటక ఎన్నికలు: గెలుపుపై నేతల ధీమా
కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆ రాష్ట్ర రాజధాని బెంగుళూరుతో పాటు.. మొత్తం 11 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌లో సుమారు 60 శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్‌పై ఆయా పార్టీల నేతలు తమ ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఎస్.ఎం.కృష్ణ స్పందిస్తూ.. తమ పార్టీ సాధారణ మెజారిటీ గెలుపొందుతుందన్నారు. సంకీర్ణ ప్రభుత్వ పాలనతో విసిగి పోయిన ఓటర్లు తమ పార్టీ వైపు మొగ్గుచూపారని, అందువల్ల కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీతో గెలుపొందుతుందన్నారు. మద్దూరు పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో ఆయన పైవిధంగా అన్నారు.

తనకు వచ్చిన నివేదికల మేరకు తొలి దశ ఎన్నికలు జరిగిన 89 స్థానాలకు గాను 45 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. దేవెగౌడ సోదరులపై కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థులను బరిలోకి దిపండం వెనుక ఏదైనా కారణం ఉందా అని కృష్ణను ప్రశ్నించగా, వారు కూడా అభ్యర్థులే. వారు మహిళలా లేదా పురుషులా అన్నది ఇక్కడి ముఖ్యం కాదు. గౌరవప్రదమైన జీవన నేపథ్యంలో నుంచి వచ్చిన అభ్యర్థులు. గట్టి పోటీ ఇస్తారు.

జేడీఎస్-భాజపాల సంకీర్ణ ప్రభుత్వ పాలనలో అవినీతి పెచ్చుమీరి పోయిందని, దీంతో ప్రజలు విసిగి పోయారని ఆయన అన్నారు. ఇదే తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన సంకేతమన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి బెంగళూరు ఎంతో ముఖ్యం. బెంగుళూరులో విజయం సాధిస్తే.. మీకు విజయం ఖాయమని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
మరిన్ని
కర్ణాటకలో 50 శాతం మేర పోలింగ్ నమోదు
బెంగాల్ సీపీఎం కార్యకర్తలపై మున్షీ మండిపాటు
'అణు' ఒప్పందంపై అనుమానాలొద్దు: కలాం
మంత్రి అర్జున్ సింగ్ వ్యాఖ్యలను కొట్టేసిన కాంగ్రెస్
కర్ణాటక ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
స్థిర ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్‌కే సాధ్యం: ప్రధాని