ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'అణు'కు కలాం మద్దతు: యూపీఏ హర్షాతిరేకం
ఇండో-యూఎస్ అణు ఒప్పందానికి భారత అణు క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మద్దతు తెలుపడంతో యూపీఏ ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. మాజీ రాష్ట్రపతి కలాం చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వంతో సహా.. దేశం గౌరవిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.

ముఖ్యంగా కలాం వ్యాఖ్యలు అణు కార్యక్రమం పుంజుకునేందుకు ఎంతో దోహదపడుతుందని, ఆయన సూచనలు, వ్యాఖ్యలను పరిగణంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అణు కార్యక్రమం ఎంతో ముఖ్యమని, అందువల్ల ఇండో-యూఎస్ అణు ఒప్పందాన్ని అమలు చేయాలని కలాం సూచించిన విషయం తెల్సిందే. ఈ ఒప్పందం అమలు వల్ల జాతీయ భద్రతకు, దేశ సౌరభౌమాధికారానికి ఎలాంటి హాని కలుగబోదని కలాం అన్నారు.

ఈ మాటలు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టాయి. కలాం వ్యాఖ్యలను ఒక్క వామపక్షాలే కాకుండా అన్ని పార్టీల నేతలు గౌవరించాల్సిందేనని ప్రధాని అన్నారు. ఆయనో గొప్ప శాస్త్రవేత్త. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారని ప్రధాని మన్మోహన్ గుర్తు చేశారు.
మరిన్ని
కర్ణాటక ఎన్నికలు: గెలుపుపై నేతల ధీమా
కర్ణాటకలో 50 శాతం మేర పోలింగ్ నమోదు
బెంగాల్ సీపీఎం కార్యకర్తలపై మున్షీ మండిపాటు
'అణు' ఒప్పందంపై అనుమానాలొద్దు: కలాం
మంత్రి అర్జున్ సింగ్ వ్యాఖ్యలను కొట్టేసిన కాంగ్రెస్
కర్ణాటక ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం