ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నదిలో పడిన బస్సు: 8 మంది జవాన్ల మృతి
జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం రెండు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. మిలిటెంట్ల కాల్పుల్లో ఒక జవాను, పత్రికా ఫోటోగ్రాఫర్‌తో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో సంఘటనలో ఎనిమిది మంది జవాన్లు దుర్మరణం పాలయ్యారు. తొలి సంఘటన సాంబా జిల్లాలో జరుగగా, రెండో సంఘటన ధోడా జిల్లాలో జరిగింది.

జవాన్ల బస్సు ధోడా జిల్లాకు వెళుతుండగా అదుపుతప్పి ఛేనబ్ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. వీరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ధోడా-కిష్‌త్వర్ రోడ్డు మార్గంలో గత నాలుగు రోజుల్లో జరిగిన మూడో ప్రమాదం ఇది.

ఈ మూడు ప్రమాదాల్లో 48 మంది మృత్యువాత పడగా, 27 మంది గాయపడ్డారు. ఈనెల 8వ తేదీన బస్సు నదిలో పడటంతో ఆరుగురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే.. మే 10వ తేదీన జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
మరిన్ని
జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ల కాల్పులు: ఐదుగురి మృతి
'అణు'కు కలాం మద్దతు: యూపీఏ హర్షాతిరేకం
కర్ణాటక ఎన్నికలు: గెలుపుపై నేతల ధీమా
కర్ణాటకలో 50 శాతం మేర పోలింగ్ నమోదు
బెంగాల్ సీపీఎం కార్యకర్తలపై మున్షీ మండిపాటు
'అణు' ఒప్పందంపై అనుమానాలొద్దు: కలాం