ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నందిగ్రామ్‌పై నివేదిక కోరిన హోంశాఖ
నందిగ్రామ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఒక నివేదిక సమర్పించాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు కేంద్రం సోమవారం ఆదేశించింది. బెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నందిగ్రామ్ పంచాయతీ పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.

ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కేంద్ర హోం శాఖ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ఇటీవలి కాలంలో హింసాత్మక సంఘటనలకు కేంద్రబిందువుగా నిలిచిన నందిగ్రామ్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన భద్రత చర్యలను వివరించాలని కేంద్రం కోరింది. ముఖ్యంగా ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కొన్ని వర్గాల వారిని ఓట్లు వేయకుండా సిపిఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఇది పెద్ద వివాదానికి దారితీసింది. పైగా ఇక్కడ మావోయిస్టులు పేల్చిన గ్రెనైడ్‌ దాడిలో ఒక బీఎస్పీ జవాన్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌పై ఒక నివేదిక సమర్పించాలని కేంద్రం కోరడం గమనార్హం. నందిగ్రామ్‌పై పూర్తిస్థాయి నివేదికను కేంద్ర హోం శాఖ కోరిందని ఆ శాఖ అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు.
మరిన్ని
గోవధకారులను క్రిమినల్స్‌గా పరిగణించాలి
పేలిన మందు పాతరలు: పాటిల్‌కు తప్పిన ప్రాణగండం
నదిలో పడిన బస్సు: 8 మంది జవాన్ల మృతి
జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ల కాల్పులు: ఐదుగురి మృతి
'అణు'కు కలాం మద్దతు: యూపీఏ హర్షాతిరేకం
కర్ణాటక ఎన్నికలు: గెలుపుపై నేతల ధీమా