ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమర్‌సింగ్ ఆరోపణలు కొట్టేసిన సీపీఎం
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరక్టర్ డాక్టర్ వేణుగోపాల్‌ను తొలగించే ఎయిమ్స్ చట్ట సవరణ బిల్లుకు సీపీఎం మద్దతు ఉందని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్ సింగ్ చేసిన ఆరోపణలను సీపీఎం తోసిపుచ్చింది. ఆయన చేసిన ఆరోపణలు వాస్తవదూరంగా ఉన్నాయని పేర్కొంది.

దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత బసుదేవ్ ఆచార్య మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో నిజానిజాలను తెలుసుకుని అమర్ సింగ్ మాట్లాడాలని హితవు పలికారు.

ఎయిమ్స్ చట్ట సవరణ బిల్లును తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టారని, ఆ తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించారన్నారు. స్టాండింగ్ కమిటీ సమీక్షించకుండా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేదన్న విషయాన్ని అమర్ సింగ్ తెలుసుకోవాలని సూచించారు.

బిల్లును తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టారని, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు ఎయిమ్స్ స్వయంప్రతిపత్తి హోదాపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి నివేదించకుండా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టలేదని ఆచార్య వివరించారు.
మరిన్ని
ఆకట్టుకున్న పర్యాటక ఉత్సవాలు  
నందిగ్రామ్‌పై నివేదిక కోరిన హోంశాఖ
గోవధకారులను క్రిమినల్స్‌గా పరిగణించాలి
పేలిన మందు పాతరలు: పాటిల్‌కు తప్పిన ప్రాణగండం
నదిలో పడిన బస్సు: 8 మంది జవాన్ల మృతి
జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ల కాల్పులు: ఐదుగురి మృతి