కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో ఆమె రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కొప్పల్, మంగుళూరులో ఈ బహిరంగ సభలు జరుగుతాయి. ముగిసిన తొలి దశ ఎన్నికల కోసం ఆమె ఈనెల ఏడో తేదీన కోలార్, బెంగుళూరులలో ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే.
కాగా, మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు కలిగిన కర్ణాటక విధాన సభకు మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. తొలి దశ పోలింగ్ ఈనెల 9వ తేదీన ముగిసిన విషయం తెల్సిందే. ఈనెల 16వ తేదీన జరిగే రెండో దశ పోలింగ్ 66 నియోజకవర్గాల్లో జరుగుతుంది.
మే 29వ తేదీన జరిగే చివరి దశ పోలింగ్‌లో మిగిలిన 69 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. తొలి ఎన్నికల్లో 1.73 కోట్ల మంది ఓటర్లు గాను 66 శాతం మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా జేడీఎస్ నేత హెచ్‌డీ.దేవెగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణకు మంచి పట్టున్న వొక్కాలిగా ప్రాంతంలో పోలింగ్ నమోదైంది.
|