ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పింక్ సిటీలో కర్ఫ్యూ: నేడు కేబినెట్ భేటీ
వరుస బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లిన రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధించారు. బాంబు పేలుళ్ళకు నిరసనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ మత సంస్థలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.

బంద్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా కర్ఫ్యూ విధించినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింథియా అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందిన జైపూర్‌లో కేవలం 12 నిమిషాల వ్యవధిలో ఏడు బాంబులు పేలిన విషయం తెల్సిందే.

ఈ వరుస పేలుళ్ళతో 67 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 200 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా.. పేలుళ్ళకు నిరసనగా రాజస్థాన్ ప్రభుత్వం బుధవారాన్ని సంతాప రోజుగా ప్రకటించింది.
మరిన్ని
జైపూర్ బాంబు పేలుళ్లు: 60ని దాటిన మృతుల సంఖ్య
జైపూర్‌లో వరుస బాంబుపేలుళ్లు
రెండో దశ ఎన్నికల ప్రచారంలో సోనియా
అమర్‌సింగ్ ఆరోపణలు కొట్టేసిన సీపీఎం
ఆకట్టుకున్న పర్యాటక ఉత్సవాలు  
నందిగ్రామ్‌పై నివేదిక కోరిన హోంశాఖ