ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కమ్యూనిస్టు వృద్ధ నేత ఆరోగ్యం విషమం  Search similar articles
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నేత హరికిషన్ సింగ్ సూర్జీత్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన్ను నోయిడాలోని మెట్రో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు వైద్య సేవలు అందిస్తోంది. ముఖ్యంగా శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్లు అమర్చారు. ఛాతి ఇన్‌ఫెక్షన్ నుంచి ఆయన ఇటీవలే కోలుకున్నారు.

మళ్లీ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 91 సంవత్సరాల వయస్సు కలిగిన సూర్జీత్ అనారోగ్య కారణాల రీత్యా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సూర్జీత్.. ఆ బాధ్యతలను ప్రకాష్ కారత్ చేపట్టారు. హరికిషన్ సింగ్ సూర్జీత్ ఆయన స్వాతంత్ర్య పోరాటంలో కూడా పనిచేశారు.
మరిన్ని
యూపీఏ మెతకవైఖరి వల్లే ఉగ్రవాదం: రాజ్‌నాథ్
తీవ్రవాదుల మతకల్లోల కుట్ర భగ్నం: పాటిల్
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో నలుగురు
దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: వసుంధరా
పింక్ సిటీలో కర్ఫ్యూ: నేడు కేబినెట్ భేటీ