ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జైపూర్ పేలుళ్లు: సైబర్‌కేఫ్ యజమాని అరెస్టు  Search similar articles
జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ళ కేసులో సైబర్‌కేఫ్ యజమానితో పాటు ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ళకు తామే బాధ్యులమంటూ ఒక ఇమెయిల్ పంపడంతో వారిని గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. షహిబాబాద్‌లో శ్యామ్ బిర్ సైబర్‌ కేఫ్ నడుతుండగా, ఈ కేంద్రంలో మరో వ్యక్తి పని చేస్తున్నారు. వీరిద్దరిని విచారణ నిమిత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అదుపులోకి తీసుకుందని ఎస్పీ దీపక్ రతన్ గురువారం మీడియాకు తెలిపారు.

కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న షమీమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. హుజి అనే తీవ్రవాద సంస్థకుగాను ఉత్తరప్రదేశ్ విభాగానికి అధిపతిగా ఉన్న షమీమ్.. గత 2006 సంవత్సరంలో జరిగిన వారణాసి పేలుళ్ళతో సంబంధం ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు.

దీంతో జైపూర్ కేసులో కూడా షమీమ్‌కు సంబంధం ఉండి వుండవచ్చని భావిస్తున్నారు. భాగ్‌పట్ జిల్లా (యూపి)లోని షమీమ్ ఇంటిలో కూడా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఎక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మరిన్ని
కమ్యూనిస్టు వృద్ధ నేత ఆరోగ్యం విషమం
యూపీఏ మెతకవైఖరి వల్లే ఉగ్రవాదం: రాజ్‌నాథ్
తీవ్రవాదుల మతకల్లోల కుట్ర భగ్నం: పాటిల్
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో నలుగురు
దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: వసుంధరా