కర్ణాటక విధాన సభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెల్సిందే.
ఇందులోభాగంగా ఈనెల పదో తేదీన తొలి దశ ఎన్నికల్లో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో దశలో 66 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది. 598 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1.10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు. 66 అసెంబ్లీ సెగ్మంట్లలో 12,271 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల బందోబస్తులో 56 వేల మంది పోలీసు బలగాలను నియమించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు భద్రతను కల్పించారు. ఈ దశ ఎన్నికల పోటీలో మాజీ ముఖ్యమంత్రులు ఎస్.బంగారప్ప, యడ్డియూరప్పలు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
|