మధ్య ప్రదేశ్‌లో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర రెవిన్యూ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల పేర్లు ఆలీరాజ్‌పూర్, సింగ్రౌలీ. ఈ రెండు జిల్లాల్లో 13 తెహసిల్స్ ఉంటాయి. ఆలీరాజ్‌పూర్ జిల్లా ఈనెల 17వ తేదీన అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
సింగ్రౌలీ జిల్లా ఈనెల 24వ తేదీ నుంచి పనిచేస్తుంది. ఆలీరాజ్‌పూర్ జిల్లాలో జోబత్, భాబ్రా తెహసిల్స్‌ను జత చేయగా, సింగ్రౌలీ జిల్లాకు దేవసర్, చిత్రాంగి తెహసిల్స్‌ను కలిపారు.
|