ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కర్ణాటక ఎన్నికలు: రెండో దశలో కమలానికే మొగ్గు  Search similar articles
కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ముగిసిన రెండో దశ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపారు. ప్రముఖ ఛానల్ ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది. రెండో దశలో మొత్తం 66 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో భాజపాకు 32-42 సీట్లలో గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 15-20, జేడీఎస్‌కు 8-12 సీట్లు చొప్పున వస్తాయని ఆ సర్వే పేర్కొంది.

కిందటి ఎన్నికలతో పోల్చితే భారతీయ జనతా పార్టీ మూడు శాతం ఓట్లను మెరుగు పరుచుకోగా, కాంగ్రెస్ పార్టీ ఒక శాతం, జేడీఎస్ రెండు శాతం మేరకు ఓట్లను కోల్పోయిందని వెల్లడించింది. మిగిలిన పార్టీలు 2-4 సీట్లలో గెలుపొంద వచ్చని సర్వే తేల్చింది. ఈనెల పదో తేదీన జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్‌లోనూ భాజపాకే మెగ్గు కనిపించిన విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు జరిగిన 155 సీట్ల (మొత్తం సీట్లు 224)కు గాను భారతీయ జనతా పార్టీ 73 సీట్లలోను, కాంగ్రెస్ (45), జేడీఎస్‌ (42)లు 87 సీట్లను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సర్వే తెలిపింది. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 29వ తేదీన 69 స్థానాలకు జరుగనుంది. కాగా, రెండో దశ పోలింగ్‌లో మాజీ ముఖ్యమంత్రులు యడ్డియూరప్ప, ఎస్.బంగారప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ.ప్రకాష్‌లు ఉన్నారు.
మరిన్ని
పూర్తిగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం: అద్వానీ
మధ్య ప్రదేశ్‌లో కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు
కర్ణాటక రెండో దశ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్
44 నెలల గరిష్ఠ రికార్డును తాకిన ద్రవ్యోల్బణం
చంద్రబాబుకు అస్వస్థత: తెదేపా శ్రేణుల కలత
ప్రశాతంగా సాగుతున్న కర్ణాటక రెండోదశ పోలింగ్