పశ్చిమ బెంగాల్ పంజాయితీ ఎన్నికల్లో నందిగ్రామ్, సింగూర్‌లను ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లా పరిషత్‌లోని మొత్తం 53 స్థానాలు ఉండగా, 32 సీట్లను తృణమూల్ కైవసం చేసుకోవటంతో వామపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తూర్పు మిడ్నాపూర్ జిల్లా పరిషత్ కైవసం చేసుకోవటం తృణమూల్ కిదే మొదటిసారి. ముర్షీదాబాద్, మాల్డా జిల్లా పరిషత్‌ల ఓట్ల లెక్కింపులో వామపక్షాలు-కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఉంది. బెంగాల్ పంచాయితీ ఎన్నికలు మూడు దశల్లో ఈనెల 11, 14, 18 తేదీల్లో జరిగాయి.
|