ప్రజల అవసరాలను గుర్తించని వామపక్ష ప్రభుత్వానికి కాలం చెల్లిందని ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. రెండేళ్ల కాలంలో వామపక్ష ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయన్నారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వామపక్షాలు స్వాగతించాలని సూచించారు. సీపీఎం ప్రభుత్వ పతనం ఇప్పుడే మొదలైందన్నారు.
నందిగ్రామ్, సింగూర్ పంచాయితీ ఫలితాలు సీపీఎం పాలనకు ఎదురుదెబ్బ అని తెలియజేశారు. వామపక్షాలవి కాలం చెల్లిన విధానాలు అని మమతా దుయ్యబట్టారు. పంచాయితీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ కొన్ని జిల్లాలో ఘన విజయం సాధించి సీపీఎంకు గట్టి జవాబు చెప్పింది.
|