భారత్ మరో మధ్యంతర క్షిపణి ప్రయోగాన్ని శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఒరిస్సా రాష్ట్రం, బాలాసూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని చాందినీపూర్ సముద్రతీర ప్రాంతం వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై గల లక్ష్యాలను సులభంగా చేధించే ఈ మధ్యతరహా క్షిపణి పృధ్వీని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
ఐటీఆర్ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. పృధ్వీ క్షిపణిని భారత రక్షణ మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవొ) తయారు చేసిందని, దీన్ని లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి మొబైల్‌లాంచర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రయోగించినట్టు వివరించాయి. సుమారు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం సామర్ధ్యం కలిగిన పృధ్వీ.. యుద్ధ సమయాల్లో ఆయుధాలను మోసుకెళ్లగలదని ఆ వర్గాలు వెల్లడించాయి.
|