పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-భాజపా కూటమి విజయం సాధించింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్ లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికల సమరంలో కూడా భాజపా గెలుపొందింది. అమృతసర్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఎస్.ఏడీ-భాజపా కూటమి అభ్యర్థి ఇందర్ సింగ్ బులారియా సుమారు 22,233 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
బులారియాకు 43,495 ఓట్లు పోలుకాగా, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి నవదీప్ గోల్డియాకు 21,262 ఓట్లు పోలయ్యాయి. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమిర్‌పూర్ స్థానాన్ని భాజపా తిరిగి కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి పోటీ చేసిన భాజపా అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ 1,74,666 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా భాజపా ఇక్కడ విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భాజపా ఇక్కడ గెలుపొందుతూ వస్తోంది.
|