ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > జాతీయ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంజనీర్‌ను రక్షించిన త్రిపుర రైఫిల్స్  Search similar articles
నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ కిడ్నాప్ చేసిన ఒక రైల్వే ఇంజనీర్‌ను అతరాముర కొండ ప్రాంతాల్లో పోరాడి త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ దళం గురవారం రక్షించాయి.

నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అస్సాం రాష్ట్రం హైలకుండి ప్రాంతానికి చెందిన దేబబర్త దాస్‌ను ట్యూకర్మా ప్రాంతంలో జరుగుతున్న పనుల నుంచి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఏప్రిల్ 26న కిడ్నాప్ చేసింది.

అప్పటి నుంచి ప్రత్యేక బలగాలు అయనను రక్షించడానికి తిరుగుతూనే ఉన్నాయి. త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ గురువారం ఈశాన్య ప్రాంతంలకు చెందిన అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ కూడా కాల్పులు జరపడంతో తీవ్రవాదులు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ ఇంజనీర్‌ను రక్షించి తీసుకొచ్చాయి.
మరిన్ని
రైలు ఛార్జీలను పెంచబోం: రైల్వే మంత్రి లాలూ
గుజ్జర్లను చర్చలకు ఆహ్వానించిన రాజ్ ప్రభుత్వం
ఆ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మాంటెక్ సింగ్
అన్ని రంగాలపై 'పెట్రో' ప్రభావం  
స్మగ్లర్ల కోసం కాశ్మీర్‌లో స్పెషల్ డ్రైవ్
పెట్రోటాక్స్‌లు తగ్గించండి :సోనియా పిలుపు