|
ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు
|
 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒక్క రాజస్థాన్‌లో మినహా మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లుథియానాలో 23 మిమీ, అమృతసర్‌లో 22 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, చంఢీఘర్ వంటి రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పలుకరించాయి.
అస్సోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సుమారు 30 మందికిపైగా మృత్యువాత పడ్డారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో వర్షాలకు ఆరుగురు చనిపోయారు. ఇకపోతే మొన్నటి వరకు గ్రీష్మతాపంతో అల్లాడి పోయిన దేశ రాజధాని వాసులు ప్రస్తుతం ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారి చల్లబడిపోయాయి.
కనీస ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు తక్కువుగా నమోదైంది. సాధారణంగా ఢిల్లీకి ఈనెల 29వ తేదీన రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. ఈ దఫా మాత్రం 108 సంవత్సరాల తర్వాత రెండు వారాలకు ముందుగానే ప్రవేశించడం అరుదైన రికార్డు. ఇదిలావుండగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావం కారణంగా వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు.
|