యూపీఏలోని మిత్రపక్ష పార్టీలన్నీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని కేంద్ర ప్రచార, ప్రసారాల శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ స్పష్టం చేశారు. అంతేకాకుండా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ప్రధాని మన్మోహన్‌కు అండగా ఉన్నారని గుర్తు చేశారు. దేశ ఇంధన భద్రతకు అణు ఒప్పందం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ఆయన తెలిపారు.
పార్లమెంటులో ప్రధాని వెల్లడించిన విషయాలకు సోనియా పూర్తి మద్దతు ప్రకటించారని మున్షీ గుర్తు చేశారు. అలాగే యూపీఏ ప్రభుత్వంతో సహా మిత్రపక్షాలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు.
|